part-time sweepers | తాండూర్, జూన్ 27: రాష్ట్ర గ్రంథాలయ పార్ట్ టైం స్వీపర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్ లో ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయ పార్ట్ టైం స్వీపర్స్ వేతనాల పెంచడం, ఉద్యోగ భద్రత గురించి, రాబోయే నోటిఫికేషన్ లో అర్హత కలిగిన వారికి అవకాశం కల్పించమని వినతిపత్రంలో కోరడం జరిగింది అన్నారు.
రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ తమ సమస్యలను సానుకూలంగా విని త్వరలోనే మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా పార్ట్ టైం స్వీపర్స్ సీహెచ్ స్వామి, మధుకర్, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.