నార్నూర్, సెప్టెంబర్ 9 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ గృహం నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తుంది. ఇందిరమ్మ నమూనా భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.5 లక్షలు కేటాయించింది. భవన నిర్మాణం పూర్తి చేసినప్పటికి.. నేటికీ ప్రారంభించకపోవడం గమనార్హం.
ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఇందిరమ్మ నమూనా గృహాన్ని ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని మండలవాసులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై హౌసింగ్ ఏఈ శ్రీకాంత్‌ను ఫోనులో వివరణ కోరగా త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.