ప్రభుత్వ పథకాలకు ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు ప్రజలు ఆధార్ సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. దండేపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్డేట్ కోసం వందలాది మంది వస్తుండడంతో, ఉదయం 6గంటలకు 30 మందికి టోకెన్ ఇచ్చి అప్డేట్ చేస్తున్నారు.
దీంతో ఉదయం 4 గంటలకే ఇక్కడికి వచ్చి టోకెన్ కోసం నిరీక్షిస్తున్నారు. వేరే చోట అయితే పది నుంచి పదిహేను రోజులు పడుతున్నదని, ఇక్కడ టోకెన్ దక్కితే ఒక్క రోజులో పని అయిపోతుందని జనాలు చెబుతుండడం గమనార్హం.
-దండేపల్లి, డిసెంబర్30