“చెన్నూర్ కాంగ్రెస్ టికెట్ కోసం 14 మంది దరఖాస్తు చేసుకు న్నాం. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి గెలిచే వారికే టికెట్ ఇస్తామ ని చెప్పాడు. కానీ.. ఇప్పుడు కనీసం ఓటరు లిస్టులో పేరులేని గడ్డం వివేక్‌కు ఇచ్చారు. ఒకే కుటుంబంలో రెండు పదవులు ఇవ్వద్దని, కనీసం రెండేళ్లు కాంగ్రెస్‌లో పనిచేసిన వారికే సీటు కేటాయి స్తామని చెప్పిన ఏఐసీసీ మాట తప్పింది. అన్నకేమో బెల్లంపల్లి, తమ్ముడి కేమో చెన్నూర్, కొడుక్కేమో పెద్దపల్లి ఎంపీ సీటు.. ఇట్లా ఒకే ఇంట్లో అందరికీ ప్రాధాన్యమిస్తే మిగతా దళితులంతా ఎక్కడికి పోవాలి. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి నచ్చకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నా. త్వరలో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతాం. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తాం.” అని మాజీ మంత్రి బోడ జనార్దన్ పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాలలోని తన నివాసంలో నిర్వ హించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.
– మంచిర్యాల, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెన్నూర్‌లో కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటున్న గడ్డం వివేక్‌కు డిపాజిట్ రాకుండా ఓడిస్తామని, ఈ ప్రాంతం నుంచి ఆయనను వెళ్లగొట్టడమే లక్ష్యంగా పని చేస్తామని మాజీమంత్రి బోడ జనార్దన్ స్పష్టం చేశారు. సోమవారం మంచిర్యాలలోని తన ఇంట్లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ చెన్నూర్ కాంగ్రెస్ టికెట్ కోసం 14 మంది దరఖాస్తు చేసుకున్నామని, అందరూ వెళ్లి పని చేసుకోండి సర్వే చేయించి, గెలిచే వారికే టికెట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. మూడో జాబితా రావడానికి ఒకరోజు ముందు వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారన్నారు. దానికి ముందు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాతో మాట్లాడి.. వివేక్ జాయిన్ కావాలంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిపించుకుంటామని నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలని, నీకు పెద్దపల్లి ఎంపీగా అవకాశం ఇస్తామని చెప్పారన్నారు.
దాన్ని బట్టే నేను స్టేట్మెంట్ ఇచ్చానని, కానీ వివేక్ పార్టీలో చేరిన తెల్లారే చెన్నూర్ అసెంబ్లీ నాకు కావాలి, పార్లమెంట్ నా కొడుక్కి కావాలంటున్నాడని మండిపడ్డారు. ఒక కుటుంబంలో రెండు పదవులు ఇవ్వొద్దని, కనీసం రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వారికే టికెట్ ఇవ్వాలని చెప్పిన ఏఐసీసీ.. ఇవాళ వివేక్‌కు ఎలా టికెట్ ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ చెప్పేది ఒకటి, చేసేది మరొకటా.. అని నిలదీశారు. కనీసం చెన్నూర్ ఓటర్ లిస్టులో పేరు లేని వివేక్‌కు టికెట్ ఎలా ఇచ్చారో చెప్పాలన్నారు.
అతనికి ఉంది కేవలం డబ్బేనని, వ్యాపారం చేసి డబ్బు సంపాదించి ఎన్నికల సమయంలో వచ్చి ఆ డబ్బును పార్టీకి చందాలుగా ఇచ్చి టికెట్ కొనుక్కొని ఎమ్మెల్యేగా పోటీ చేసే సంస్కృతి ఆయనదని మండిపడ్డారు. వాళ్ల అన్నకేమో బెల్లంపల్లి, అతనికేమో చెన్నూర్, కొడుక్కేమో పెద్దపల్లి ఎంపీ టికెట్, బావకు ఏమో వికారాబాద్ టికెట్ ఇచ్చారన్నారు. ఇలా మాల సామాజిక వర్గానికి రావాల్సిన సీట్లన్నీ వారికే పోయాక మిగిలిన దళితులు ఏం చేయాలి.. ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. మీ నాన్న ఎంపీగా గెలిచారు, కేంద్ర మంత్రిగా చేశారు. నువ్వు ఎంపీగా.. మీ అన్న మంత్రిగా చేసి ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని కోరారు.
అన్నను చెన్నూర్‌లో ఓడగొడితే బెల్లంపల్లికి పోయాడని, ఇప్పుడు తమ్ముడిని ఓడగొడితే ఎటు పోతారో చూడాలన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయని వారికి అసలు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. డబ్బుల సంచులు పట్టుకొని వచ్చి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను కొనుగోలు చేసి ఓట్లు వేయించుకుంటారా అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ధ్వంద విధానం నచ్చకే తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. మాకు జరిగిన అన్యాయం ఇంకో దళితుడికి జరగొద్దన్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తామని చెప్పారు.