నార్నూర్, అక్టోబర్ 5 : జల్ జంగల్ జమీన్ కోసం నైజాం సర్కారుతో పోరాడిన ఆదివాసీ ముద్దుబిడ్డ కుమ్రం భీం 85వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పేందోర్ సంతోష్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం లోకారికే కుమ్రం భీం చౌరస్తా వద్ద ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జోడేఘాట్లో నిర్వహిస్తున్న కుమ్రం భీం వర్ధంతి సభకు ఆదివాసులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్రం విజయ్, జైతు పటేల్, జంగు, భారత్, నాగో రావు, దేవురావు, చందు, మోహన్, బాపురావు తదితరులున్నారు.