జైనూరు : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనురు మండలంలోని పాట్నాపూర్ సర్పంచ్ ఖందరే లక్ష్మిబాయి బాలాజీ ( Lakshmibai Balaji ) బుధవారం ఆసిఫాబాద్‌లోని ఎమ్మెల్యే కోవలక్ష్మి ( MLA Kova Lakshmi ) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్( BRS ) పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ తెలంగాణ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజాప్రతినిధులు తిరిగి రావడం పార్టీపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నా.
ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు కొడప్ప ప్రకాష్ ,శివునూర్ సర్పంచ్ జాదవ్ శ్రావణ్, కోలాం శంకర్, మనకు గూడా సర్పంచ్ దేవుషా, యశోదాబాయి కేశవ్, దుబ్బగూడా సర్పంచ్ మాడవి కౌశల్య, దబోలి సర్పంచ్ మెస్రం గంగాదేవి భావురావ్, మాడవి నాగురావ్, మాజీ సర్పంచ్ మాడవి భీంరావ్ , నాయకులు ముండే సతీష్, సమాధాన్ తదితరులు పాల్గొన్నారు.