ఆసిఫాబాద్ టౌన్, జనవరి 1 : విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బుధవారం తన నివాసంలో ఎస్టీయూ 2025 డైరీ, క్యాలెండర్‌ను సంఘం నాయకులతో కలిసి ఆవిషరించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న బడుగు బలహీన వర్గాల పిల్లలకు మెరుగైన విద్యనందించి వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలన్నారు. అనంతరం పీఆర్టీయూ డైరీని కూడా ఆ సంఘం నాయకులతో కలిసి ఆవిషరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మాణిక్‌రావు, తుకారాం, సంజయ్ కుమార్, సులేమాన్, సంతోశ్, లక్ష్మణ్, వినోద్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్, నాయకులు నీసార్, హైమద్, శంకర్ పాల్గొన్నారు.
ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్ వర్ధంతి పోస్టర్ల విడుదల
జైనూర్, జనవరి 1 : మండల కేంద్రంలో ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్ వర్ధంతి పోస్టర్లను ఎమ్మెల్యే కోవ లక్ష్మి విడుదల చేశారు. అనంతరం సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. పలుచోట్ల దుకాణాలను పారంభించారు. అనంతరం ఆమె కార్యకర్తలతో మాట్లాడారు. ఈ నెల 6న ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జైనూర్ పర్యటన సందర్భంగా ద్విచక్ర వాహన ర్యాలీతో స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. జంగాంలో కొనసాగుతున్న జంగుబాయి దీక్ష కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కొడప హన్ను పటేల్, మాజీ వైస్ ఎంపీపీ, చీర్లె లక్ష్మణ్, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు మడావి భీంరావ్, సిర్పూర్(యు) బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోడసం ధర్మరావ్, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు కుమ్ర భగవంత్‌రావ్, లింగాపూర్ మాజీ జడ్పీటీసీ లక్యా నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మెస్రం అంబాజీరావ, ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్ యుత్ మార్లవాయి సభ్యులు, సార్మేడి గణపత్, మార్లవాయి మాజీ సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్, పావర్గూడ మాజీ సర్పంచ్ గేడం లక్ష్మణ్, నాయకులు పవన్ జన్నావార్, ఆత్రం శంకర్ కొలాం, జ్యోతిబాపులే మాలీ సంఘం మండల అధ్యక్షుడు పెట్కులే హుస్సేన్ పాల్గొన్నారు.