కాసిపేట : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం భరత్ కాలనీకి చెందిన పత్తిపాక మణిదీప్( Pathipaka Manideep ) జాతీయ స్థాయి ఫుట్ బాల్ పోటీలకు ( National level Select) ఎంపికయ్యాడు. జనగాంలో ఈనెల 25, 26, 27 తేదీల్లో జరిగిన 69వ రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా నుంచి సోమగూడెంకు చెందిన మందమర్రి మోడల్ కళాశాల ఇంటర్ సెకండీయర్ చదువుతున్న విద్యార్ధి పత్తిపాక మణిదీప్ ప్రతిభ చూపి జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడని మంచిర్యాల జిల్లా డీఐఈవో ఆంజయ్య, ఏసీఎఫ్ నెక్రటరీ బాబురావు తెలిపారు. ఈ మేరకు సోమవారం మణిదీప్‌ను అభినందించి ఎంపిక పత్రం అందించారు.
ఎంపికైన వారు శ్రీనగర్‌లో వచ్చే నెల 2 నుంచి 12వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని వివరించారు. పుట్‌బాల్ టీంకు కోచ్‌గా గాలిపెల్లి సురేందర్ వ్యవహరించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ఒలంపిక్ అసోసియేషన్, ఫుట్‌బాల్ సెక్రెటరీ రఘునాథరెడ్డి, శేఖర్‌తో పాటు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపికైన విద్యార్థి ,తల్లిదండ్రులు పత్తిపాక అంజయ్య తదితరులు పాల్గొన్నారు.