ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పాండురంగ్ ఆత్మహత్య
రాష్ట్ర ప్రభుత్వం సమయానికి జొన్నలు కొనుగోలు చేసి లోడింగ్ చేయకపోవడంతోనే మనస్తానికి గురై తన తమ్ముడు నుగురే పాండురంగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు బాధిత రైతు అన్న నుగురే నారాయణ ఆరోపించారు.
ఇచ్చోడ(సిరికొండ), జూన్ 23 : రాష్ట్ర ప్రభుత్వం సమయానికి జొన్నలు కొనుగోలు చేసి లోడింగ్ చేయకపోవడంతోనే మనస్తానికి గురై తన తమ్ముడు నుగురే పాండురంగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు బాధిత రైతు అన్న నుగురే నారాయణ ఆరోపించారు. మంగళవారం సిరికొండ మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకు లు, నుగురే నారాయణ మాట్లాడారు. పొన్న గ్రామానికి చెందిన పేద రైతు పంట కొనుగోలు చేయకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. బాధిత కుటుంబాన్ని ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న పరామర్శించారన్నారు. కానీ.. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, కాంగ్రెస్ నాయకులు విమర్శించడం తగదన్నారు.
ఇంత వరకు కాంగ్రెస్ ఏ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. దమ్ముంటే రైతు కుటుంబానికి రూ.30 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు స్పందించి తక్షణమే రూ.3 లక్షలు ఆర్థిక సహాయం అందజేశారని గుర్తు చేశారు. రైతు ఆత్మహత్య చేసుకున్న కారణాలను వెతకాల్సింది పోయి ప్రతిపక్షాలపై విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. చాతనైతే రైతుల బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ పెంటన్న, బీఆర్ఎస్ నాయకులు చౌహన్ సూర్యకాంత్, రోహిదాస్, రాజారాం, సునీల్, సూర్యకాంత్, రంజాన్, చందు, భీంరావు పటేల్, నర్సయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!
MBBS Seat | పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన మాగనూర్ ముద్దుబిడ్డ
Ajmer Jailer | మహిళా ఖైదీలతో ఇంటి పనులు చేయిస్తున్న జైలర్ అరెస్ట్
పూలతో బతుకమ్మ వైభవం- అక్షరాలతో భావితరాల వికాసం
ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై అధికారుల రైడ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

