దస్తూరాబాద్ : లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని గొడిసెర్యాల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన వాటర్ ప్లాంట్ ఎన్ఓసీ కోసం గ్రామ కార్యదర్శి శివకృష్ణను సంప్రదించగా ఎన్వోసీ ఇవ్వడానికి 15000 రూపాయలు డిమాండ్ చేశాడు. కాగా, రూ.12 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ మేరకు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనలను మేరకు 12000 రూపాయలు గ్రామ ప్రకృతి వనం వద్ద కార్యదర్శికి ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ మధు పట్టుకున్నారు. వెంటనే కార్యదర్శి శివకృష్ణను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరు డబ్బులు అడిగిన అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాలని డీఎస్పీ మధు సూచించారు.