లక్షెట్టిపేట, జూన్ 14 : ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ సర్వేను పక్కాగా చేయాలని మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు కార్యదర్శి సెక్రటరీలను ఆదేశించారు. మండలంలోని లక్ష్మీపూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో నిర్వహిస్తున్న భగీరథ సర్వేను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ తిరుగుతూ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఉందా.., నీటి సరఫరా సక్రమంగా ఉందా.. అని తెలుసుకొని, ప్రభుత్వం ఇచ్చిన యాప్లో పొందుపర్చాలని సూచించారు. ఇప్పటివరకు చేపట్టిన సర్వేను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీపీవో వెంట ఎంపీడీవో సరోజ, ఎంపీవో ప్రసాద్, ఆయా గ్రామాల కార్యదర్శులు ఉన్నారు.
తాండూర్, జూన్ 14 : మండల కేంద్రంతో పాటు, ఆయా గ్రామాల్లో మిషన్ భగీరథ సర్వేను ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. సర్వే పకడ్బందీగా నిర్వహిం చి, వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూ చించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది గ్రామాల్లో ఇంటింటా తిరిగి, మిషన్ భగీరథ కనెక్షన్ల సంఖ్య, నీటి సరఫరా, కుటుంబ సభ్యుల వివరాలను సర్వే చేసి యాప్ ద్వారా నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట కార్యదర్శి తపాస్కుమార్, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది ఉన్నారు.
కెరమెరి, జూన్ 14: గ్రామాల్లోని మిషన్ భగీరథ నీటి సర్వేలు ఇంటింటికీ తిరిగి పకడ్బందీగా చేపట్టాలని ఎంపీడీవో మహ్మద్ అమ్జద్పాషా అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డబ్ల్య్లూఎస్ ఏఈ విశ్వేశ్వర్తో కలిసి మిషన్ భగీరథ పథకం పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈసీ ఆఖ్యానాయక్, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.