తాండూర్ : ఈనెల 14న జరుగనున్న పంచాయతీ పోలింగ్( Panchayat Polling ) సమయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తాండూర్ మండల ఎన్నికల సహాయ అధికారి, ఎంపీడీవో శ్రీనివాస్( Srinivas ) సంబంధిత అధికారులకు సూచించారు. పోలింగ్ ప్రక్రియలో పీవోలు క్రియాశీలకంగా వ్యవహరించాలని, ఎన్నికల నిబంధనలను పక్కాగా పాటిస్తూ సజావుగా నిర్వహించాలన్నారు.
తాండూర్ మండలంలో మంగళవారం ప్రిసైడింగ్ అధికారులకు, స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణలో అవగాహన కల్పించారు. సకాలంలో నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. చెక్ లిస్ట్ కు అనుగుణంగా బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలన్నారు.
సీటింగ్ అరెంజ్మెంట్. సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ వంటి నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటరు ఓటు వేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ అబ్జర్వర్ ఈర్ల శంకర్, జనరల్ అబ్జర్వర్ మనోహర్, తహసీల్దార్ జ్యోత్స్న, మాదారం ఎస్సై సౌజన్య, డీఎల్పీవో సతీష్, జోనల్ అధికారులు సంతోష్, మనోహర్, లత తదితరులు పాల్గొన్నారు.