ఇచ్చోడ, మే 17 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(బీ) గ్రామంలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం ఎంపీ గొడం నగేశ్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. అనంతరం అడిగామ(బీ) గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన కల్వర్ట్ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, ముక్రా(బీ) సర్పంచ్ ఖాతున్ నజీర్ ఖాన్, మాజీ సర్పంచ్ అడప మారుతి పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ సర్పంచ్ జాకు, తదితరులు పాల్గొన్నారు.