కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని ధర్మరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ( PACS Chairman ) గా తాటిపాముల శంకర్ గౌడ్( Shanker Goud ) సోమవారం తిరిగి సొసైటీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు బాధ్యతలు తీసుకున్నారు. చైర్మన్ గా ఉన్న నీలా రాంచందర్ సర్పంచ్ ఎన్నికల్లో గెలవడంతో ఆ పదవికి రాజీనామా చేశారు.
సొసైటీకి వైస్ చైర్మన్‌గా ఉన్న తాటిపాముల శంకర్ గౌడ్ సోమవారం చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని నూతన చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, సొసైటీ డైరెక్టర్లు సోగాల సాగర్, కాసు సురేందర్, దుర్గం లక్ష్మీ, జంజిరాల విష్ణు మూర్తి, చెల్ల రమేష్, చుంచు మల్లేష్, సర్పంచ్ లు పేరం మల్లేష్, కల్వల శరత్ కుమార్, మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, గ్రామ అధ్యక్షులు అగ్గి సత్తయ్య, రాంటెంకి వాసు దేవ్, లంక లక్ష్మణ్, సల్లూరి ప్రభాకర్, కసాడి శ్రీను, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్‌లను రద్దు చేసిన ప్రభుత్వం పాత పాలకవర్గాల స్థానంలో పర్సన్ ఇన్‌చార్జీలకు నియమించింది. తమను తొలగించి పర్సన్ ఇన్చార్జీలను నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు చైర్మెన్లు హైకోర్టును ఆశ్రయించారు. కొత్త పాలకవర్గాలు నియామకమయ్యేంత వరకు తాజా పాలకవర్గాలనే కొనసాగించాలని వారు అభ్యర్థించారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు పీఏసీఎస్‌లకు పాత కార్యవర్గమే బాధ్యతలు తీసుకుంటుంది.