Krunal Pandya : ముంబై ఇండియన్స్‌పై వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన కృనాల్ పాండ్యా (Krunal Pandya) మరోసారి తాను మ్యాచ్ విన్నర్ అని నిరూపించుకున్నాడు. రాయ్‌పూర్‌లో బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలించిన వికెట్ మీద గొప్ప బ్యాటింగ్ ప్రదర్శనతో ఆర్సీబీని గెలిపించాడు కృనాల్. ఓవైపు కండరాలు పట్టేసినా.. శరీరం సహరించకున్నా పట్టువదలని అతడు.. సంచలన ఆటతో ముంబై ఓటమిలో కీలకమయ్యాడు. మ్యాచ్ అనంతరం విజయం మిగిల్చిన మచ్చ ఇదుగో అని ఆ ఆల్‌రౌండర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పంచుకున్నాడు.
రాయ్‌పూర్‌లో ప్రధాన ఆటగాళ్లు విఫలమైన చోట కృనాల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లను కాచుకున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ ఓ దశలో కండరాలు పట్టేసినా పట్టువిడవలేదు. క్రీజులో పడుతూ లేస్తూనే సిక్సర్లు బాదిన అతడు 46 బంతుల్లో 73 పరుగులతో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి లోనైన కృనాల్.. తన పొట్టపై ఏర్పడిన గాయం మచ్చను చూపించాడు.
𝐅𝐞𝐥𝐥. 𝐆𝐨𝐭 𝐮𝐩. 𝐅𝐨𝐮𝐠𝐡𝐭 𝐚𝐠𝐚𝐢𝐧. 🙌
Krunal Pandya gave absolutely everything tonight 👏#TATAIPL Revenge Week 2026 ➡️ #RCBvMI | LIVE NOW 👉https://t.co/y41wRLoDHD pic.twitter.com/vU0Z4asbqd
— Star Sports (@StarSportsIndia) May 10, 2026
‘మన పోరాటం ఎంత గొప్పదో చెప్పడానికి కొన్ని మచ్చలు ఉదాహరణగా నిలుస్తాయి’ అనే క్యాప్షన్‌తో కృనాల్ తన బొడ్డు పైభాగంలో ఎడమవైపు కందిపోయిన చర్మం ఫొటోను పంచుకున్నాడు. క్రీజులో కింద పడడం మూలంగా కావచ్చు.. దాదాపు పావు భాగం చర్మం ఎర్రగా మారింది. గాయం నొప్పిని భరిస్తూనే జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడిన కృనాల్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రస్తుతం 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆర్సీబీ.. తర్వాతి మూడు మ్యాచుల్లో కోల్‌కతా, పంజాబ్, సన్‌రైజర్స్‌ను ఢీకొట్టనుంది.
KRUNAL PANDYA – AN ABSOLUTE FIGHTER. 🫡 pic.twitter.com/UvUc0r0qGC
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 11, 2026
రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబైని 166కే కట్టడి చేసిన ఆర్సీబీ స్వల్ప ఛేదనలో తడబడింది. టాపార్డర్ విఫలమైనా.. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా(73) మెరుపులతో కోలుకున్న బెంగళూరును ఆఖర్లో ముంబై బౌలర్లు వణికించారు. మ్యాచ్ చేజారుతున్న వేళ ఆపద్భాందవుడిలా అవతరిండాడు భువనేశ్వర్.
The way Kieron Pollard looks at Krunal Pandya when he talks about him 🥹#IPL #cricket pic.twitter.com/U0V5nnd8jP
— CREX (@Crex_live) May 11, 2026
కృనాల్, రొమారియో షెపర్డ్ వెంటవెంటనే ఔటయ్యాక చివరి ఓవర్లో 15 రన్స్ అవసరమైన వేళ.. రాజ్ బవ వైడ్, నో బాల్ వేయగా నాలుగో బంతిని కవర్స్ దిశగా భువి స్టాండ్స్‌లోకి పంపాడు. ఆ సిక్సర్‌తో ముంబై ఆశలు ఆవిరవ్వగా.. ఐదో బంతికి సింగిల్, ఆరో బంతికి రెండు పరుగులు రాగా బెంగళూరు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇప్పటివరకూ 11 మ్యాచుల్లో 15.29 సగటుతో భువి 21 వికెట్లు పడగొట్టాడు.