వాంకిడి : వాంకిడి మండలంలో రోడ్డు దాటుతుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో ( Road accident ) ఒకరు మృతి చెందారు. ఎస్సై ప్రశాంత్ ( SI Prasanth ) తెలిపిన వివరాల ప్రకారం. మండల కేంద్రానికి చెందిన గేడం సోనేశ్వర్(30) అనే యువకుడు స్థానిక తహసీల్ కార్యాలయంలో పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహానం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో సోనేశ్వర్ తలకు, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనదారుడు కొమురం మల్కుకు సైతం తలకు గాయాలు అయ్యాయి.
స్థానికులు ఇద్దరు క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోనేశ్వరు తీవ్ర రక్త స్రావం కావడంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడని పోలీసులు వివరించారు. కొమురం మల్కు పరిస్థితి విషమంగా ఉందని, మృతుడి తమ్ముడు గేడం సూరజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.