జైనథ్, జూలై 13 : ఉమ్మడి మండలంలోని భోరజ్ పరిధిలో గల పెండల్వాడ గ్రామంలో విద్యుత్ షాక్‌తో బావానే అశోక్(56) మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అశోక్ ఆయన కుమారుడు రవి, ఆయన భార్య సుమన్‌బాయి, తల్లి గిరిజాబాయి శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమించారు. అశోక్ ఎప్పటి లాగే ఇంటి ఎదుట గదిలో నిద్రించాడు.
రాత్రి 12 గంటల ప్రాంతంలో నిద్రమత్తులో మంచంపై నుంచి కుడి కాలు ఎదురుగా ఉన్న ఇనుప కూలర్‌పై పడడంతో విద్యుత్ షాక్ వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జైనథ్ ఎస్సై గౌతం నాయక్, ఏఎస్సై ఆత్మారాం ఆదివారం శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.