వాంకిడి : ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లా వాంకిడి మండలంలోఎడ్ల బండిని (Bullock cart ) ఢీ కొని ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి పటగూడ గ్రామంలో చోటు చేసుకుంది. వాంకిడి ఎస్సై వివరాల ప్రకారం కోపగూడ గ్రామానికి చెందిన సిడం మంగు(35) తాపీ మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
శుక్రవారం పనులు ముగించుకొని వాంకిడి నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో పటగూడ సమీపంలో తన ద్విచక్ర వాహనాన్ని ( Two Wheeler ) అజాగ్రత్తగా నడుపుతూ ఎదురుగా వస్తున్న ఎడ్ల బండిని ఢీ కొట్టాడు. దీంతో అతడి ఛాతీపై తీవ్రమైన గాయాలు అయ్యాయి. చికిత్స కోసం కుమరం భీం జిల్లా ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు.