ఎదులాపురం, ఫిబ్రవరి 19 :‘భరతమాత ముద్దుబిడ్డ.. హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు.. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు.. మరాఠా సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన యోధుడు చత్రపతి శివాజీ” అని పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం 393 జయంత్యోత్స వాల సందర్భంగా ఆయన చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ, ఆరె మరాఠా సంక్షేమ సంఘాల సభ్యులు, సార్క్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు తీశారు. శివాజీ విగ్రహా లతో శోభాయాత్ర నిర్వహించారు. కాగా.. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కాంగార్పూర్, బెదోడ గ్రామా ల్లో నూతనంగా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాలను స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సం ఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతిని నిర్వహించారు. శివాజీ చౌక్‌లోని విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, గౌరవాధ్యక్షుడు నర్సాగౌడ్, సభ్యులు మేకల అశోక్, నవీన్ కుమార్, జక్కుల శ్రీనివాస్, సత్యనారాయణ ఉన్నారు. సార్క్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి నీరటి ఉదయ్ కిరణ్, మీడియా ఇన్చార్జి కేంద్రె లక్ష్మణ్, సభ్యులు సన్నీ, సందీప్, సాయి, కంటూరి టిల్లు, కృష్ణ తదితరులున్నారు. జిల్లా బీసీ సంఘం మాజీ నాయకులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు ఈర్ల సత్యనారాయణ, కొరెడ్డి పార్థసారథి, హన్మాండ్లు యాదవ్, అన్నదానం జగదీశ్వర్, ప్రసాద్, స్వదీప్ సింగ్, ఉరే గణేశ్, ప్రమోద్ కుమార్ఖత్రి తదితరులున్నారు.
బుద్ధ విహార్‌లో..
ఆదిలాబాద్ పట్టణం భుక్తాపూర్‌లోని మహాప్రజ్ఞ బుద్ధ విహార్‌లో ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా గౌతమ బుద్ధుడు, అంబేద్కర్, ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటాలకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా అధ్యక్షుడు రత్నజాడే ప్రజ్ఞకుమార్, మహాప్రజ్ఞ బుద్ధ విహార్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు ఆరె ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షుడు తాడే రాహుల్, రమాబాయి అంబేద్కర్ మహిళా మండలి అధ్యక్షురాలు తాయిడే పూజ, సభ్యులు హరీశ్, భాస్కర్, సుగుదేవ్ అర్చన, షీలా బాయి, దీప, అర్పిత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
సార్క్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో..
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 19 : ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని సార్క్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద ఉన్న శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి నీరటి ఉదయ్ కిరణ్, బీసీ సంఘం కార్యదర్శి దరాడే విష్ణు, సార్క్ హ్యూమన్ రైట్స్ మీడియా ఇన్చార్జి కేంద్ర లక్ష్మణ్ సన్నీ, సందీప్, యూత్ సభ్యులు సాయి, కంటూరి టిల్లు, కృష్ణ పాల్గొన్నారు.
వసతిగృహంలో పరుపులు అందజేత
ఛత్రపతి జయంతిని పురస్కరించుకొని బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని దివ్యాంగుల వసతి గృహంలో పరుపులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ముజాహిద్, సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, సామాజిక కార్యకర్త ప్రియాంక చింతల తదితరులు పాల్గొన్నారు.
బేల మండలంలో..
బేల, ఫిబ్రవరి19 : మండల కేంద్రంతో పాటు మండలంలోని చప్రాల, అవల్పూర్ తదితర గ్రామాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ శివాజీ మహారాజ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గంభీర్‌ఠాక్రే, సతీశ్ పవార్, వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, మస్కే తేజ్రా వ్, విపిన్ఖోడే, మరాఠా కులస్తులు, నాయకులు, యువజన సంఘాల నాయకులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
బోథ్ మండలంలో..
బోథ్, ఫిబ్రవరి 19 : ఛత్రపతి శివాజీ మహారాజ్ 369వ జయంతి వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు. బోథ్, కౌఠ (బీ), పొచ్చెర, సొనాల తదితర గ్రామాల్లోని విగ్రహాలకు పూలమాలు వేశారు. బోథ్‌లో శివాజీ విగ్రహానికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, బోథ్ సహకార సంఘం చైర్మన్ కే ప్రశాంత్, సర్పంచ్ సురేందర్‌యాదవ్, ఏఎంసీ చైర్మన్ రుక్మణ్‌సింగ్, జీ రాజుయాదవ్, ఆడె గజేందర్, జీవీ రమణ తదితరులు పూలమాలలు వేశారు. ఆరె మరాఠా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సొనాలలో మెగా రక్తదాన శిబిరం
బోథ్, ఫిబ్రవరి 19: మండలంలోని సొనాల గ్రామంలో నవ నిర్మాణ్ వెల్ఫేర్ సొసైటీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ యువసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది వచ్చి దాతల నుంచి రక్తాన్ని సేకరించారు. గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన 40 మంది యువకులు ముందుకొచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సీ సదానందం, సొసైటీ, యువసేన అధ్యక్షుడు కే శుద్ధోధన్, అజయ్, జీవీ రమణ, సుభాష్ సూర్య, రామాయి శంకర్, అజయ్, నాగరాజు, యువకులు, గ్రామపెద్దలు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి మండలంలో..
నార్నూర్, ఫిబ్రవరి 19 : మరాఠా సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన మహానీయుడు ఛత్రపతి శివాజీ అని పలువురు నా యకులు కొనియాడారు. ఇంద్రవెల్లి మం డల కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతిని కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బైక్‌లతో నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. మ హనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ డోంగ్రే మారుతి, జడ్పీటీసీ అర్కా పుష్పలత, ఉప సర్పంచ్ గణేశ్ టేహేరే, ఎం పీటీసీ స్వర్ణలత-మహేశ్, నాయకులు రితేశ్ రాథోడ్, మరప రాజు, దీపక్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జుపటేల్, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షు డు శివాజీ, భీం ఆర్మీ అధ్యక్షుడు దత్త పరత్వాగ్, నాయకులు, వ్యాపారులు తదిత రులు పాల్గొన్నారు.
ఉట్నూర్ మండలంలో..
ఉట్నూర్ రూరల్, ఫిబ్రవరి 19 : మండలంలోని శ్యాంపూర్ గ్రామంలో శివాజీ జ యంతిని ఘనంగా నిర్వహించారు. వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, ఎస్ఐ సుమన్ భరత్‌తో కలిసి శివాజీ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. పులిమడుగు గ్రామంలో సర్పంచ్ జాదవ్ సరిత గ్రామస్తులతో కలిసి శివాజీ చిత్రపటానికి పూలమాల వేశారు. హస్నాపూర్ గ్రామంలో గ్రామస్తులు శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లిక, ఉప సర్పంచ్ కేశవ్, మాజీ సర్పంచ్ జగదీశ్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్, రితీశ్ రాథోడ్, వేద ప్రకాశ్, వెంకటి, వినోద్, మహేశ్, శ్రీరాం, అంబేద్కర్ సం ఘం, అన్నాబావుసాటే, హిందూ వాహిణి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్ మండలంలో..
బజార్హత్నూర్, ఫిబ్రవరి 19 : మండలంలోని దేగామ, బజార్హత్నూర్, భోస్రా, భూతాయి, గిర్నూర్ తదితర గ్రామాల్లో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. శివాజీ చిత్రపటానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. మండలకేంద్రం లో యువకులు రక్తదానం చేశారు. అంతకుముందు ఆయా గ్రామాల్లో ఛత్రపతి శివాజీ విగ్రహంతో శోభాయాత్ర తీశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల సభ్యులు శ్రీకాంత్, రాకేశ్, సాయికృష్ణ, దీపక్, కళ్యాణ్, అరుణ్, ఆరె పాండు, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ సభ్యులు పాల్గొన్నారు.
ఉట్నూర్‌లో..
ఉట్నూర్, ఫిబ్రవరి19 : శివాజీ జయంతిని ఉట్నూర్ చౌక్‌లో ఘనంగా నిర్వహించారు. పలువురు శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీరాంనాయక్, సట్ల అశోక్, కొండేరి రమేశ్, కొలిపాక రాజశేఖర్, రాజేశ్వర్, ధన్లాల్, గంగన్న, గోపి, లింగన్న, గంగాధర్, శ్రీనివాస్, దేవిదాస్, హరిప్రసాద్, లక్ష్మణాచారి, గట్క రమేశ్, గంగాధర్, లింగాగౌడ్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, యువకులు పాల్గొన్నారు.
గుడిహత్నూర్ మండలంలో..
గుడిహత్నూర్, ఫిబ్రవరి 19 : మండల కేంద్రంలోని శివకల్యాణ మండపంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. హిందూ వా హిణి శ్రీరామ్ సేన యువసేన అధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో 90 మంది యువకులు రక్తదానం చేశారు.జడ్పీటీసీ పతంగే బ్రహ్మానంద్, హిందూ వాహిణి అధ్యక్షుడు దయానంద్ మహారాజ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వామన్ గిత్తె, యువసేన మండల అధ్యక్ష, కార్యదర్శులు కేంద్రె సం దీప్, రాజేంద్రప్రసాద్, శ్రీరాం సేన జిల్లా అ ధ్యక్షుడు, తల్లి పిలుపు ఎగ్జిక్యూటివ్ లోకండే అనిల్, కేంద్రె లక్ష్మణ్, ఉపసర్పంచ్ గజానంద్, జాదవ్ రమేశ్, అంకతి రవీందర్, చందాపురే కైలాస్, తిడికే నితీశ్, యువకులు తదితరులు పాల్గొన్నారు. కాగా.. మండలంలో శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. యువకులు శివాజీ చిత్రపటంతో శోభాయాత్ర నిర్వహించారు. నృత్యాలు చేస్తూ ప్రధానవీదులగుండా ర్యాలీ తీశారు. బస్టాండ్ ఎదుట ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వామన్ గిత్తె జెండాను ఎగురవేశారు. మండలంలోని మన్నూర్, లింగాపూర్ గ్రామాల్లో శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఇచ్చోడలో భారీ ర్యాలీ
ఇచ్చోడ, ఫిబ్రవరి 19 : మండలంలో శివాజీ మహరాజ్ జయంతిని ఘనంగా ని ర్వహించారు. మండలకేంద్రంలో భారీ ర్యాలీ తీశారు. శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మ రాఠాలు భారీ ర్యాలీ నిర్వహించారు. ముక్రా(బీ) గ్రామంలో శివాజీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిరికొండతోపాటు సోంపల్లి, పొన్న, ఎక్స్‌రోడ్డులో జయంతి ఘనంగా నిర్వహించారు. ఆరె మరాఠా సంఘం నా యకులు గాడ్గె సుభాష్, సూర్యకాంత్, సుభా ష్ పాటిల్, అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బలరాం, మరాఠా నాయకులు సందీ ప్, సునీల్ పటేల్, బాలాజీ పాల్గొన్నారు.
శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ
ఇచ్చోడ (సిరికొండ), ఫిబ్రవరి 19 : శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సిరికొండ మండలంలోని సోంపల్లి గ్రామం లో శివాజీ చౌక్‌లో శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు గ్రామస్తులు భూమి పూ జ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కదం శంకుతలాబాయి, బోయిన్వాడ్ అమోల్, గ్రామ పటేల్ గణేశ్, సచిన్ పాల్గొన్నారు.