కోటపల్లి, శ్రీరాంపూర్ : మంచిర్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy) పర్యటన సందర్భంగా పోలీసులు ముందస్తుగా బీఆర్ఎస్ నాయకులను అరెస్టు (Arrest ) చేశారు. బీఆర్ఎస్వీ (BRSV ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానిశెట్టి విద్యాసాగర్‌ను కోటపల్లి పోలీసులు ( Police ) ముందస్తు అరెస్టు చేశారు. ఉదయాన్నే విద్యాసాగర్ ఇంటికి వెళ్లిన పోలీస్ లు బలవంతంగా అతడగిని అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా విద్యాసాగర్ (Vidyasagar) మాట్లాడుతూ తనకు అరెస్టులు కొత్తేమి కాదని, తెలంగాణ ఉద్యమంలో లాఠీలకు ఎదురొడ్డి నిలిచి తెలంగాణ సాధించుకున్న సత్తా బీఆర్ఎస్ నాయకులకు ఉందని అన్నారు. ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి తన పర్యటన ల సమయంలో బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయిస్తూ తెలంగాణ ఉద్యమకారుల గొంతు నొక్కాలని చూస్తున్నాడని విమర్శించారు. రోజురోజుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక Bఅక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.
శ్రీరాంపూర్‌లో..
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియా బీఆర్ఎస్ నాయకులను ఆదివారం అరెస్టు చేశారు. పట్టభద్రుల సమావేశానికి వస్తున్న సీఎం రాక సందర్భంగా ముందస్తుగా అరెస్టు చేశారు. బీఆర్ఎస్ ఏరియా పంబాల ఎర్రయ్య, ఎండీ రఫీ ఖాన్, సంతోష్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.