భైంసా, మే 29 : వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతుండడంతో విత్తనాలు వేయడానికి అన్నదాతలు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సీజన్లో వరి, పత్తి, పల్లి తదిరత పంటలపై రైతాంగం దృష్టి సారిస్తున్నది. ఎక్కువ మంది రైతులు ప్రైవేట్ దుకాణాల్లో కొనుగోలు చేస్తుంటారు. పంటల సాగు సమయంలో అనేక నకిలీ విత్తనాల కంపెనీలు ప్రచారం ముమ్మరం చేస్తాయి. దీంతో నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి పంటలు సాగు చేసిన రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రోహిణి కార్తె రాగానే రైతులు విత్తనాలు కొనుగోలు కొనడం ప్రారంభిస్తారు. ఇదే అదునుగా నాసిరకం విత్తనాలను తక్కువ ధరతో ఎక్కువ దిగుబడి వస్తుందంటూ కొందరు దుకాణాల నిర్వాహకులు నమ్మబలికి అంటగడుతున్నారు. కొంత మంది విక్రయదారులు గ్రామాలకు వెళ్లి రైతులను నమ్మిస్తూ వారికి అప్పజెబుతున్నారు. తీరా విత్తనాలు వేసిన తర్వాత అవి మొలకెత్తవు. అప్పుడు నాసిరకం అని తెలియడంతో మోసపోవడం రైతువంతవుతుంది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి. తెలంగాణ ప్రభుత్వం నకిలీ విత్తనాలను కట్టడి చేయడానికి పకడ్బందీ చర్యలు చేపట్టింది. వ్యవసాయ, పోలీసు శాఖలను సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా చేస్తూనే ఉంది. పలు కఠిన నిబంధనలు కూడా అమలు చేస్తున్నది. అయినప్పటికీ కొన్నిచోట్ల రైతులను దళారులు మోసం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
నోటిఫైడ్.. నాన్ నోటిఫైడ్ విత్తనాలలో తేడా..
విత్తనాల్లో ప్రభుత్వ పరంగా విడుదలయ్యేవి, ప్రైవేట్‌గా విడుదలయ్యేవి ఉంటాయి. ప్రభుత్వం రూపొందించిన రకాలను నోటిఫైడ్ పేరిట మార్కెట్లోకి వస్తాయి. ప్రైవేట్ సంస్థలు రూపొందించిన విత్తనాలను నాన్ నోటిఫైడ్ పేరిట వస్తాయి. నోటిఫైడ్ విత్తనాల నాణ్యత పంపిణీ ప్రమాణాలు 1960 విత్తన చట్టం పరిధిలోకి వస్తాయి. నోటిఫైడ్ విత్తనాల నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేనట్లయితే ఉత్పత్తి దారులు పంపిణీ దారులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు.
అధికారుల సూచనలు పాటించాలి
రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో దగ్గరలో ఉన్న వ్యవసాయాధికారిని సంప్రదించాలి. అధికారుల సూచనలు పాటించాలి. విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు అవి మేలురకమైన విత్తనాలేనా అనేది పరిశీలించి కొనుగోలు చేయాలి. నాసిరకం విత్తనాలకు వ్యాపారులు ప్రచారం చేసినా, విక్రయించినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి.
–రాంచందర్ నాయక్, ఏవో, భైంసా
రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు