బేల : మండల సిర్సన్న గ్రామంలో అకాల వర్షాలకు ( Rains ) తడసి ముద్దయినా నువ్వుల పంట పొలాలను గురువారం మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి తేజా రెడ్డి , వ్యవసాయ విస్తీరణ అధికారి రమణ క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు ( Fields Inspections) . పంట నష్టం ఎంతమేరకు వాటిల్లిందో రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి సాయి తేజా రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల వివరాలను జిల్లా వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
రైతులు విత్తనాలు విత్తు కోవడానికి ఇంకా సమయం ఉన్నందున తొందరపడి విత్తనాలను విత్తు కొవ్వదని సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యమైన విత్తనాలను కొనాలని, విత్తనాల ప్యాకెట్పైన గడువు తేదీలను చూసి రైతులు కొనుగోలు చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి లేని విత్తనాలు ఎవరైనా అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.