భీమారం, మే 12 : మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలతో పాటు దాంపూర్ పాఠశాలలో సోమవారం రెండో రోజూ భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. అధికారులు ఉదయం 9 గంటలకు రావాల్సి ఉండగా, పదిన్నర అయినా కనిపించలేదు.
భీమారంలో తహసీల్దార్ సదానందం 10.26 గంటలకు రాగా, రికార్డు అసిస్టెంట్ 10.24, సర్వేయర్ 10.26, గిర్దావర్ 10.02, ధరణి ఆపరేటర్ 10, జూనియర్ అసిస్టెంట్లు 9.20 గంటలకు రావడం కనిపించింది. కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేక చొరవ చూపి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుండగా, కొందరు అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక అధికారుల తీరుతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.