శ్రీరాంపూర్, ఏప్రిల్ 23 : శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు, ఓసీపీలకు చెందిన వివిధ యూనియన్ల నాయకులు, ముఖ్య కార్యకర్తలు, కార్మికులు బుధవారం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సమక్షంలో టీబీజీకేఎస్‌లో చేరారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన టీబీజీకేఎస్ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట నాయకులు నడిపెల్లి విజీత్‌రావు, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్, ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత సమక్షంలో గడ్డం మల్లయ్య, బుస్స రమేశ్, వెంగల కుమారస్వామి, ప్యాగె మల్లేశ్, మోతె రమేశ్, తిరుపతిరావు, అన్వేష్, కాసారపు లక్షణ్, కే ఓదెలు, ఏ రాజ్‌కుమార్, గడుసు సాయికుమార్, రామారావు, సాయికుమార్, కుమారస్వామి,
వేణుగోపాల్, సాయికిరణ్, సతీశ్, దుర్గాప్రసాద్, మహేందర్, ప్రశాంత్, రాజేశ్, జీ సతీశ్, ఎం రవి, కే రాజశేఖర్, బీ మధూకర్, కే సాగర్, కే రమేశ్, రవితేజ, జీ సతీశ్, జీ ఆనంద్, ఎస్ రాజు, బీ రవి, పీ సురేశ్, శ్యాంకుమార్ నాగరాజు, గోవర్ధన్, కే తిరుపతి మరో 100 మంది కార్యకర్తలు టీబీజీకేఎస్, బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్సీ కవిత కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యూనియన్‌లో చేరిన నాయకులు మాట్లాడుతూ ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకుల మాయ మాటలు నమ్మి తాము మోసపోయామని అన్నారు.
సింగరేణి సంస్థలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సాధించి పెట్టిన హక్కులు, సౌకర్యాలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క హక్కు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి టీబీజీకేఎస్‌లో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, కేంద్ర కార్యదర్శి పానగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్‌రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా గనులు ఓసీపీలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.