నిర్మల్ చైన్గేట్, ఫిబ్రవరి 22 : నిర్మల్ పట్టణానికి చెందిన తొడసం శంభు తన భార్య సుమి త్ర అనారోగ్యంగా ఉండడంతో శనివారం నిర్మల్ మాతా,శిశు ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చాడు. వైద్యులు పరీక్షించి మందులు రాశారు. వైద్యులు రాసిచ్చిన మందులు ఫార్మసిలో లేకపోవడంతో ప్రైవేటుగా కొనుగోలు చేయాలని సిబ్బంది సూచించారు. ఈ మేరకు ఆయన ప్రైవేటుగా తీసుకోవడంతో రూ.300 అయ్యాయని తెలిపాడు.
ఈ సందర్భంగా శంభు మాట్లాడుతూ.. ప్రభుత్వ మందుల దుకాణంలో వైద్యులు రాసిచ్చిన మందులు లేకపోవడంతో బాధాకరమన్నారు. మా వంటి పేద లు బయట ప్రైవేటుగా కొనుగోలు చేయాలం టే వందల రూపాయలు అవుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మం దులను అందుబాటులో ఉంచాలని కోరాడు.