కడెం, మార్చి 21 : సదర్మాట్ చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని సదర్మాట్ కాల్వ సాధన సమితి అధ్యక్షుడు రాజేందర్ హపావత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కడెం ప్రాజెక్ట్ ఈఈ విఠల్‌కు మండలంలోని చిట్యాల్ గ్రామ రైతులతో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొలాలు పట్ట దశలో ఉన్నాయని, రెండు తడులు నీరు అందకుంటే పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు.
కావున సదర్మాట్ చివరి ఆయకట్టు వరకు చిట్యాల్, బెల్లాల్ వరకు నీటిని అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఈఈ స్పందిస్తూ తక్షణమే సాగునీటిని అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు రమేశ్, నరేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.