కుభీర్, సెప్టెంబర్ 23: మున్నూరు కాపులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడంతో పాటు కాపులు ఐక్యతను చాటేoదుకు ప్రతి మున్నూరు కాపు యువత చైతన్యవంతులు కావాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొట్టే హనుమండ్లు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఆయా మండలాల ప్రతినిధులతో కలిసి నిఘ్వా, మాలేగాo, కుప్టి, కస్ర తదితర గ్రామాలలో కులస్తులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి మాట్లాడారు. ప్రతి మున్నూరు కాపు యువత సమాజానికి దిక్సూచిగా నిలువాలని అప్పుడే సమాజంలో మున్నూరు కాపులకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు.
రాజకీయంగా ఎదగాలంటే ముందుగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉన్న మున్నూరు కాపులు రాజకీయ, ఉద్యోగ, వ్యాపార రంగాలలో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మున్నూరు కాపులు ఆర్థికంగా బలోపేతం కావడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భైంసా పట్టణంలో అక్టోబర్ 5న నిర్వహించే తాలూకా మున్నూరు కాపుల ప్రత్యేక సమావేశానికి తాలుకాలోని అన్ని గ్రామాల్లో ఉన్న మున్నూరు కాపు సంఘాల నుండి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట బైంసా టౌన్ అధ్యక్షులు ఎన్పోతుల మల్లేష్, మాజీ కౌన్సిలర్ రావుల పోశెట్టి, లక్ష్మీనారాయణ, దొంతుల దేవిదాస్, కే.శంకర్, కుప్టి చిన్ను, ఆయా గ్రామాల సంఘాల బాధ్యులు ఉన్నారు.