కడెం, మార్చి 21 : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఆలసత్వం వహించకుడదని, తక్షణమే పీఆర్సీ, డీఏలను విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు భుక్యా రాజేశ్‌నాయక్, ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. ఈ-కుబేర్ వ్యవస్థను రద్దు చేయాలన్నారు.
అలాగే ఇటీవల పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుల పూర్తి అలవెన్స్‌లు క్లియర్ చేయాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాలకు కంప్యూటర్లను అందజేయాలని, ఉపాధ్యాయుల పదవీ విరమణ కార్యక్రమాన్ని అధికారికంగా ఎంఆర్సీలో నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు మధుకర్, మునేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షుడు అంబాజీనాయక్, సులోమన్నాయక్ పాల్గొన్నారు.