విలువైన వస్తువులు ఇంట్లో పెట్టి పండుగలకు ఊరెళ్లొద్దు : ఎస్ఐ కృష్ణారెడ్డి
దసరా పండుగ సెలవుల సందర్భంగా ప్రజలు విహార యాత్రలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కుభీర్ ఎస్ఐ ఏ కృష్ణారెడ్డి సూచించారు.
కుభీర్ : దసరా పండుగ సెలవుల సందర్భంగా ప్రజలు విహార యాత్రలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కుభీర్ ఎస్ఐ ఏ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం అయినా నిర్మల్ జిల్లా కుభీర్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ గ్రామాలలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలని పేర్కొన్నారు. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు కిటికీలు, ఇంటి తలుపులు పటిష్టంగా మూసివేయాలని అన్నారు. విలువైన వస్తువులను ఇంట్లో ఉంచరాదని, ఒకవేళ ఉంచాల్సి వస్తే పటిష్టంగా వాటిని భద్రపరుచుకోవాలని సూచించారు.
దుర్గామాతను ప్రతిష్టించిన నిర్వాహకులు భద్రతా చర్యలు పాటించాలని తెలిపారు. మండపాల వద్ద విద్యుత్, అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. జనావాసాల్లో ప్రజలకు లౌడ్ స్పీకర్ల తో ఇబ్బందులు తలెత్తకుండా సౌండ్ సిస్టంను మితంగా ప్రసారం చేయాలని అన్నారు. ఆయా గ్రామాల్లోని కూడళ్ళు, రహదారుల్లో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత మండపాల నిర్వాహకుల దేనని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ నవరాత్రి ఉత్సవాలతో పాటు దసరా పండుగను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన కోరారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

