ఖానాపూర్ టౌన్, జనవరి 31: మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో నేడు పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాక్సిన్ (Free Vaccination) ఇవ్వనున్నట్లు పశుసంవర్ధక శాఖ ఖానాపూర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాంచందర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఖానాపూర్లోని పశువుల దవాఖానలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పెంపుడు కుక్కలకు రాబిస్ వ్యాక్సిన్ ను ఉచితంగా ఇవ్వనున్నందున కుక్కలను పెంచుకునే యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాటికి రేబిస్ వ్యాక్సిన్ను ఇప్పించాలని ఆయన కోరారు.