నిర్మల్ అర్బన్/సోన్, డిసెంబర్ 12 : భక్తుల కొంగుబంగారంగా కొలిచే మహా లక్ష్మీ అమ్మవారి విగ్రహ ఊరేగింపు సోమవారం వైభంగా కొనసాగింది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రూ.2.65 కోట్ల నిధులతో నిర్మించిన బంగల్పేట్ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్స వాలు సోమవారం ప్రారంభమయ్యాయి.నాలుగు రోజు ల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొలి రోజు అమ్మవారి విగ్రహంతో ఊరేగింపు నిర్వహించారు. నగరేశ్వర వాడలోని శివాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పూజలు చేశారు. నూతనంగా ప్రతిష్ఠించనున్న అమ్మవారి విగ్రహాన్ని క్రేన్ ద్వారా ట్రాక్టర్లోకి ఎక్కించగా, మంత్రి అల్లోల వాహనం నడిపి శోభాయాత్రను ప్రారంభించారు.
అభివృద్ధే ధ్యేయంగా ముందుకు..
జిల్లా అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నా మని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శోభాయ్రాత ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాను ఆధ్యాత్మిక నిలయంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. జిల్లాలో నిరాదర ణకు గురైన ఆనేక ఆలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చామని వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.100 కోట్లతో దాదాపు 600 ఆలయాలను నిర్మించామని గుర్తు చేశారు. ప్రజలు ఆధ్మాత్మిక భావనను పెంపొందించుకొని సన్మార్గంలో పయ నించాలన్నారు. మరిన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
అమ్మవారి విగ్రహ ఊరేగింపునకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జిల్లా కేంద్రంలోని అన్ని వార్డుల ప్రజలతో పాటు చుట్టు పక్కల గ్రామాలైన అనంతపేట్, మేడిపల్లి, ఎల్లపెల్లి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో మంగళహారతులతో తరలివచ్చారు. అశేష భక్తజనసందోహం నడుమ పట్టణంలోని పలు వీధుల్లో మూడు గంటల పాటు ఊరేగింపు సాగింది.
ఆకట్టుకున్న పోతరాజులు, గుస్సాడీ నృత్యాలు
శోభాయాత్రలో గుస్సాడీ నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డీజే పాటలకు భక్తులు పాదం కలిపారు.
అమ్మవారి చెంతకు పాదయాత్రగా..
నిర్మల్ మండలం ఎల్లారెడ్డిపేట్, నీలాయిపేట్, మేడిపెల్లి గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాదయాత్రగా నిర్మల్‌లోని బంగల్పేట్ మహాలక్ష్మీ ఆలయానికి చేరుకున్నారు. మహిళలు సుమారుగా 800 మంది మంగళహారతులతో తరలివచ్చి అమ్మవారి విగ్రహా ఊరేగింపులో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో నిర్మల్ జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, నాయకులు రాంకిషన్ రెడ్డి, స్పెషల్ క్లాస్‌వన్ కాంట్రాక్టర్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్, ఎస్పీ రాజు, నరేందర్, పద్మాకర్,ఆలయ చైర్మన్ గంగాధర్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు సూరపు సాయన్న, సునంద రాము, దుర్గ పద్మాకర్, ఎంపీటీసీ గాండ్ల లలిత విలాస్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
‘బండి’ నోట అన్ని బంగి మాటలే…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్నేవన్నీ బంగి(అబద్ధాలు) మాటలేనని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నిర్మల్ మండం రత్నాపూర్కాండ్లీలో సోమవారం అంబేద్కర్ సంఘ భవనాన్ని ప్రారంభించారు. గ్రామంలోని శివాలయ పునర్నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ చేసిన పాదయాత్రకు ప్రజల స్పందన కరువైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, ఈ స్ఫూర్తిని దేశంలో చాటేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్ మార్చడంతో బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని విమర్శించారు. ఇప్పుడే దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ నాయకత్వంపై చర్చ జరుగుతున్నదని గుర్తు చేశారు. ఈనెల 14న ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నిర్మల్ జిల్లాలో బండి సంజయ్ నిర్వహించిన 12రోజుల పాదయాత్రలో ఒక్క రూపాయన్న కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇస్తామని హామీ ఇచ్చారా అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, మండల కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, మాజీ ఎఫ్ఎసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, సర్పంచ్ లావణ్య, మాజీ ఎంపీటీసీ మహేశ్‌రెడ్డి, నాయకులు ముత్యంరెడ్డి ఉన్నారు.