నిర్మల్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్మల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో కొండాపూర్ సమీపంలో జాతీయ రహదారికి ఇరువైపులా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో 3 లక్షల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… భవిష్యత్ తరాలకు పచ్చదనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్రాభివృద్ధితోపాటు భవిష్యత్ తరాలకు పచ్చదనాన్ని అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. అనంతరం వరద బాధితులకు విజయ డెయిరీ ఆధ్వర్యంలో పాల ప్యాకెట్లను పంపిణీ చేశారు.
నిర్మల్‌లోని ఎన్టీఆర్ స్టేడియం ప్రేక్షకుల గ్యాలరీలో 60 వేల మొక్కలతో ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్‌ను, మన నిర్మల్ పేరుతో రూపొందించిన లోగోను మంత్రి ప్రారంభించారు. వర్టికల్ గార్డెన్తో స్టేడియానికి, పట్టణానికి ప్రత్యేక ఆకర్షణ వచ్చిందని మంత్రి అన్నారు. నిర్మల్ పట్టణాభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
నిర్మల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు వేణుగోపాల చారి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.