సారంగాపూర్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఏయిడెడ్ ఉన్నత విద్యా సంస్థల్లోని (Aided educational institutions) దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ (Reservation) కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పల్ల నిర్మల్ జిల్లా స్పందన ప్రధాన కార్యదర్శి సాకు పెళ్లి సురేందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ కల్పించడం వల్ల దివ్యాంగ విద్యార్థులకు ప్రవేశంలో అదనంగా గరిష్టంగా ఐదు సంవత్సరాలు ప్రయోజనం పొందవచ్చని పేర్కొన్నారు.
రాష్ట్రంలో దివ్యాంగులను ఐదు కేటగిరీలుగా విభజించి ప్రతి వైకల్యానికి ప్రత్యేక రిజర్వేషన్ అమలు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో బ్యాక్లాగ్ పోస్టులను దివ్యాంగులతో భర్తీ చేసి పెన్షన్ పెంచుతారన్న నమ్మకాన్ని ధీమాను వ్యక్తం చేశారు.