కూలర్‌ను పక్కకు జరుపుతుండగా కరెంట్ షాక్.. యువకుడు మృతి
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన ఎంబాడి సతీష్ (27) ఇంట్లో ఇనుప ఎలక్ట్రిక్ కూలర్‌ను పక్కకు జరుపుతుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు.
దస్తురాబాద్, ఆగస్టు 30: విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన ఎంబాడి సతీష్ (27) ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ఎస్సై సాయి కుమార్ తెలిపారు.
వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న సతీష్ శనివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇంట్లో ఉన్న ఇనుప ఎలక్ట్రిక్ కూలర్‌ను పక్కకు జరిపే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు.
సమాచారం అందుకున్న వెంటనే దస్తురాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి భీమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

