బాసర: బాసర వద్ద (Basara) గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన మహిళను పోలీసు రక్షించారు. నవీపేట మండలానికి చెందిన గున్నాల లింగవ్వ.. కుటుంబ కలహాలతో బారలోని గోదావరి నదిలో ఆదివారం ఉదయం ఆత్మహత్యం చేసింది. గమనించిన కానిస్టేబుల్ మోహన్ సింగ్.. ఆమెను రక్షించారు. గతకొంత కాలంగా భర్త వేధిస్తున్నాడని, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమెను స్టేషన్‌ను తరలించి, కౌన్సిలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మహిళను కాపాడిన కానిస్టేబుల్ మోహన్ సింగ్‌ను బారస ఎస్ఐ, గ్రామస్తులు అభినందించారు.
ఈ నెల 15న బాసర గోదావరి నదిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు యువకులు మరణించిన విషయం తెలిసిందే. వారంతా 20 ఏండ్లలోపు యువకులే కావడం గమనార్హం. రాజస్థాన్‌కు చెందిన మూడు కుటుంబాలు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్నాయి. గత ఆదివారం ఆయా కుటుంబాలకు చెందిన 18 మంది బాసర అమ్మవారి దర్శనానికి వెళ్లారు.
ఈ సందర్భంగా ఐదుగురు యువకులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేస్తుండగా, గల్లంతయ్యారు. గోదావరిలో తేలిన ఇసుక మేట వద్దకు చేరుకుని స్నానాలు చేస్తుండగా, లోతైన ప్రాంతంలో మునిగి చనిపోయారని పోలీసులు చెప్పారు. దిల్సుఖ్నగర్ శాలివాహననగర్ చెందిన కిరాణా వ్యాపారి ప్రవీణ్ తమ్ముడు రితిక్(22), అతని బంధువు మోహన్(19), కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు రాకేశ్ (20), మదన్ (18), భరత్ (16) గోదావరి నదిలో స్నానానికి వెళ్లి మృతి చెందారు.