నిర్మల్ : జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారుఖీ సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, కంప్యూటర్ గదిని పరిశీలించారు.తరగతి గదిలోకి వెళ్లి గణిత శాస్త్రం సబ్జెక్ట్ పై విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు.
విద్యార్థిని చెప్పిన సమాధానంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కళాశాల ఆవరణలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, భోజనం, విద్య, పాఠశాల నిర్వహణ సక్రమంగా జరగాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీఓ సాయిరామ్, తదితరులు ఉన్నారు.