కుభీర్, మార్చి 12: నిర్మల్ జిల్లా కుభీర్ మండల వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ, పశువైద్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మూగజీవాలకు గాలికొంటూ వ్యాధి టీకాల కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. కుబీర్, పల్సి పశు వైద్యాధికారులు విశ్వజిత్, ప్రకాష్ ఆధ్వర్యంలో నెలరోజులపాటు టీకాల కార్యక్రమం కొనసాగుతుందని పశువైద్యాధికారులు తెలిపారు.
గురువారం మండలంలోని పార్డి (కె), శివుని పలుసు తాండ, రంజిని, రంజిని తాండ తదితర గ్రామాలలో పశువులకు టీకాలు వేశారు. గ్రామాలలో ఏ ఒక్క పశువు మిగలకుండా అన్ని పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు వేయించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గంగమణి, సత్యనారాయణ, పల్సి గోపాలమిత్రలు పవన్, జీవన్, రైతులు పాల్గొన్నారు.