కుభీర్ : మే 01: మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నిలిపేందుకు ఎన్నో విధాల కృషి చేస్తున్న ఎంపీడీఓ గంగాసాగర్ రెడ్డిని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్ అభినందించారు. గంగాసాగర్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తైన సందర్భంగా శుక్రవారం కుబీర్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన పలువురు ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల ప్రతినిధులు ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి పనితీరుపై ప్రశంసలు కురిపించారు.
శిథిలావస్థలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి మరమ్మతులు చేపట్టి.. లక్షలు వెచ్చించి నూతనంగా నిర్మించిన కార్యాలయంలా తీర్చిదిద్దిన ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డికి ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో ఎక్కా లోటుపాట్లు జరగకుండా.. సమర్ధంగా నిర్వహించిన ఆయన పనితీరును కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎంపీఓ భీమేష్, కుబీర్ సర్పంచ్ కందూరి సాయినాథ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్, ఆత్మ చైర్మన్ సిద్ధం వివేకానంద, ఏఎంసి మాజీ కందూర్ సంతోష్, ఏపీఓ హర్లాల్, పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఉపాధ్యక్షులు తోట సంజీవ్, మండల అధ్యక్ష కార్యదర్శులు, విజయ్ కుమార్, పాముల కిరణ్, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు.