బాసర : నిర్మల్ జిల్లా బాసర శ్రీ సరస్వతీ అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను గురువారం లెక్కించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ లెక్కింపు సాయంత్రం వరకు కొనసాగింది. హుండీ లెక్కింపులో అమ్మవారికి నగదు రూపంలో రూ. 46లక్షల 57వేల 122 ఆదాయం సమకూరగా, మిశ్రమ బంగారం 60.2గ్రాములు, మిశ్రమ వెండి 2కిలోల 902గ్రాములు, విదేశీ కరెన్సీ 8 డాలర్లు లభించాయి.
ఈ మొత్తం ఆదాయం 58 రోజుల్లో సమకూరిందని ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు. హుండీ లెక్కింపులో చైర్మన్ శరత్‌పాఠక్, ఏఈవో సుదర్శన్, ఆలయ సిబ్బంది, కామారెడ్డి శ్రీరాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.