జైనథ్, ఫిబ్రవరి 2 : మండలంలోని నిరాల, బాలాపూర్ గ్రామాల పరిధిలో చేపడుతున్న కాలువ నిర్మాణానికి రైతులు సహకరించాలని కావాల్సిన నష్టపరిహారం త్వరలోనే అందించేందుకు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న భరోసా ఇచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో కాలువ నిర్మాణంలో కోలుపోతున్న భూములకు సంబంధించిన రైతులతో ఆయన మాట్లాడారు. బాలాపూర్‌లో 35, నిరాలలో 19 ఎకరాల్లో కాలువ నిర్మాణ పనులకు రైతులు సహకారం అందించాలన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేయాలని ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్ మహేందర్నాథ్, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీపీ గోవర్ధన్, వైస్‌ఎంపీపీ విజయ్ కుమార్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
మండలంలోని కరంజీ గ్రామానికి చెందిన ఎన్ రమేశ్‌రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే జోగు రామన్న పరామర్శించారు. ఆయన వెంట మాజీసర్పంచ్ మహేందర్ రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి, గోవర్ధన్, రఘురాం ఉన్నారు.
రోడ్డు వెడల్పు పనులను పూర్తి చేస్తాం
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 2 : జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్ నుంచి తెలంగాణ చౌక్ వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్‌లో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్ల వెడల్పు కార్యక్రమంలో నాలుగైదు డిపార్టుమెంట్లు కలిసి పని చేయాల్సి ఉంటుందని అందుకే ఆలస్యమవుతుంద్నారు. త్వరలోనే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఆయన వెట టీఆర్ఎస్ నాయకులు రాంకుమార్, రహీం, సాయిని రవికుమార్, లింగారెడ్డి ఉన్నారు.