ఎండ @ 47 డిగ్రీలు
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరువైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత మరింత పెరిగింది. గత మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలోనే అత్యధికంగా బుధవారం నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
- నిర్మల్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.5 డిగ్రీలు నమోదు
- ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
మంచిర్యాల, మే 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరువైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత మరింత పెరిగింది. గత మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలోనే అత్యధికంగా బుధవారం నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 46.3, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 46.3, ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో 46.2 డిగ్రీలతో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న నాలుగైదు రోజుల పాటు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వేడి గాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం 10 గంటల నుంచే సూర్యప్రతాపం మొదలవుతున్న నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల దాకా అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

