నిర్మల్ టాప్-3.. పదిలో 98.96 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మూడో స్థానం
నిర్మల్ జిల్లా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 98.96 శాతం ఉత్తీర్ణత తో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచినట్లు డీఈవో భోజన్న తెలిపారు. నిర్మల్ జిల్లా వ్యాప్తం గా 9743 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. బాలురు 4779 మంది పరీక్ష రాయ గా 4711 మంది(98.58 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
- 181 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 29 : నిర్మల్ జిల్లా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 98.96 శాతం ఉత్తీర్ణత తో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచినట్లు డీఈవో భోజన్న తెలిపారు. నిర్మల్ జిల్లా వ్యాప్తం గా 9743 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. బాలురు 4779 మంది పరీక్ష రాయ గా 4711 మంది(98.58 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 4964 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4931 మంది(99.34 శాతం) ఉత్తీర్ణత సాధించారు. దీంతో 98.96 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో నిర్మల్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలో 18 కేజీబీవీ పాఠశాలలు ఉం డగా 865 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 862 మంది పాసయ్యారు. ఇందులో 15 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా వ్యాప్తంగా 168 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 119 ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 109 ప్రైవేటు పాఠశాలలకు 62 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సా ధించాయి. జిల్లా వ్యాప్తంగా 277 పాఠశాలలకు 181 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
ఆదిలాబాద్ స్థానం-21
ఎదులాపురం, ఏప్రిల్ 29 : పదో తరగతి ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రస్థాయిలో 21వ స్థానంలో నిలిచింది. 96.60 శాతం ఉత్తీర్ణతతో విద్యార్థులు ప్రతిభ చాటారు. కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక చొరువ చూపినా.. 9వ స్థానం నుంచి 21వ స్థానంలో నిలిచింది. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 10,875 మంది హాజరు కాగా.. 105 38 మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది ఆదిలాబాద్ 97.40 ఉత్తీర్ణత శాతంలో 9వ స్థానం లో నిలువగా ఈసారి శాతంతోపాటు స్థానం కూ డా పడిపోయింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్ మాట్లాడుతూ.. ఫలితాలు తగ్గడానికి కారణాలను పాఠశాలలవారీగా సమీక్షిస్తామన్నారు. ఎకడ తప్పిదాలు జరిగాయో తెలుసుకుంటూ వాటిని సరి చేసేలా చర్య లు తీసుకుంటామన్నారు. జూన్లో సప్లిమెంటరీ పరీక్షలుంటాయని, విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లిం చి సన్నద్ధం కావాలని సూచించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

