బోథ్, డిసెంబర్ 30: ఆరుగాలం కష్టించే అన్నదాతకు రైతుబంధు పథకం వరం లాంటిదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బోథ్ మండలంలోని 19 గ్రామాలకు మంజూరైన రూ.1.90 లక్షల దండారీ ఉత్సవాల చెక్కులను పట్నాపూర్ గ్రామంలో గురువారం అందించారు. రూ.2 లక్షల సీడీఎఫ్తో నిర్మించనున్న సీసీరోడ్డు, రూ.3 లక్షల జడ్పీ నిధులతో కట్టనున్న డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. అంతకుముందు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. రైతుల కష్టాలు చూసి కొంతైనా సాయం చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. రెండు పంటలకు కలిపి ఎకరానికి రూ.10 వేలు అందిస్తున్నారన్నారు. దండారీ ఉత్సవాల కోసం ప్రతి గూడేనికి రూ.10 వేల చొప్పున అందిస్తున్నారని పేర్కొన్నారు. జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్ సలాం, సర్పంచ్ పంద్రం సుగుణ, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎస్ రుక్మాణ్సింగ్, ఐటీడీఏ డైరెక్టర్ మెస్రం భూమన్న, పంద్రం శంకర్, బోథ్ సర్పంచ్ జీ సురేందర్యాదవ్, చట్ల ఉమేశ్, కే వెంకట రమణాగౌడ్, ఎలుక రాజు, రఫీ, ఐటీడీఏ ఏటీడబ్ల్యూవో సౌజన్య, ప్రధానోపాధ్యాయుడు గొడం చందన్, ఆయా గ్రామాల పటేళ్లు, దేవరీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
దండారీ, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దండారీ, కల్యాణలక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అందజేశారు. మండలంలోని 29 మందికి దండారీ చెక్కులను, నలుగురికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ పెంట వెంకటరమణ, ఎంపీడీవో అబ్దుల్సమద్, తహసీల్దార్ శ్రీదేవి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, నాయకులు కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.