‘పది పరీక్షల్లో మూడోసారి ప్రథమ స్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నాం. ఈనెల 14(శనివారం) నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈసారి నిమిషం నిబంధన అమలులో లేదు. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభం అవుతుండగా.. ఐదు నిమిషాలలోపు కేంద్రాలకు చేరుకోవాలి.’ అని నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
– నిర్మల్ అర్బన్, మార్చి 12
డీఈవో భోజన్న : నిర్మల్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కలిపి 9,758 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఇందులో బాలురు 4,786.. బాలికలు 4,964.. ప్రైవేటుగా 8 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 47 కేంద్రాలు ఏర్పాటు చేశాం. 47 మంది చీఫ్ ఎగ్జామినేషన్ అధికారులు, 47 డిపార్ట్మెంటల్ అధికారులు, 13 మంది అడిషనల్ డీవోలు, ఏడుగురు అడిషనల్ కస్టోడియన్లు, 47 మంది సిట్టింగ్ స్కాడ్లు, 535 మంది ఇన్విజిలేటర్లు, ముగ్గురు ఫ్లయింగ్ స్కాడ్స్‌ను నియమించాం. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే 905998773 నంబర్‌ను సంద్రించాలి.
డీఈవో : మాస్ కాపీయింగ్‌ను నిరోధించడానికి ప్రతి కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. కేంద్రాల్లో 163 బీఎన్ఎస్ సెక్షన్ అమలులో ఉంటుంది. జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశించాం. జిల్లా వ్యాప్తంగా ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తాయి. ఇందులో తహసీల్దార్, ఎస్సై స్థాయి అధికారి, విద్యాశాఖ అధికారులు ఉంటారు.
డీఈవో : జిల్లాలో 35 నుంచి 39 డిగ్రీల సెల్సియస్‌కుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు తాగునీరు, ఫ్యాన్లు ఏర్పాటు చేశాం. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అందుబాటులో ఉంటారు.
డీఈవో : గతేడాది ఫలితాల్లో నిర్మల్ జిల్లా 96.7 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 15వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు అక్టోబర్ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించాం. వెనుకడిన విద్యార్థులను ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ప్రీ ఫైనల్, నిత్యం టెస్ట్‌లు, గ్రాండ్ టెస్టులు, స్లిప్ టెస్టులు నిర్వహించాం.
డీఈవో : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు హాల్ టికెట్ లు పంపిణీ చేశాం. ప్రైవేటు పాఠశాలలు ఫీజులు చెల్లిస్తేనే ఇస్తామని ఒత్తిడి తేవద్దని హెచ్చరించాం. ప్రైవేట్ పాఠశాలలు హాల్‌టికెట్లు ఇవ్వకపోతే నేరుగా నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోని పరీక్షకు హాజరుకావచ్చు.
డీఈవో : ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచిస్తున్నాం. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుపనుంది. ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించారు. వారిని మానసికంగా కూడా సిద్ధం చేశారు.