నిర్మల్ చైన్‌గేట్, ఫిబ్రవరి 9 : మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ పట్టణంలో సోమవారం ఆర్డీవో కార్యాలయం నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు స్వీప్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, సీపీవో జీవరత్నం, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్‌గోపాల్, డీఈవో భోజన్న, ఎక్సైజ్ అధికారి రజాక్, డీవైఎస్వో శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ పాల్గొన్నారు.
సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లో సోమవారం ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ నిర్వహించారు.