నిర్మల్ చైన్‌గేట్, ఏప్రిల్,4: అటవీ, రెవెన్యూ భూ వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ, రెవెన్యూ భూ వివాదాల పరిష్కారంపై అధికారులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఎకరం వి లువైనదేనని, అటవీ, రెవెన్యూ భూముల హ ద్దులను తక్షణమే గుర్తించి రెగ్యులర్ సర్వేలు నిర్వహించాలన్నారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, జిల్లా అటవీశాఖ అధికారి నాగినిభాను, ఆర్డీవో రత్నకల్యాణి, ఆర్అండ్బీ ఈఈ అశోక్‌కుమార్, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి జిల్లాల కలెక్టర్లతో సన్న బియ్యం పంపిణీ పై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నిర్మల్ నుంచి కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, డీఎం సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.