ఊరూరా మంగళవారం అర్ధరాత్రి న్యూ ఇయర్ జోష్ కనిపించింది. ప్రజానీకం 2024కి బైబై చెప్పి.. 2025కి ఘనస్వాగతం పలికింది. యువత పాటలపై స్టెప్పులేస్తూ ఉర్రూతలూగించింది.
ఎక్కడ చూసినా కేక్‌లు కట్ చేస్తూ.. మిఠాయిలు పంచుకుంటూ పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవడమే కనిపించింది. ఇక వివిధ వ్యాపార వర్గాలు స్పెషల్ ఆఫర్లతో ఆకట్టుకోగా.. కాసుల వర్షం కురిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టింది.