మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లలో నూతన పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. పది మున్సిపాలిటీల్లో ఏడు చోట్ల కొత్త చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేశారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరేసింది. ఇక్కడ మొత్తం 20 స్థానాల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7, స్వతంత్ర అభ్యర్థులు 4 చోట్ల గెలిచారు.
మున్సిపాలిటీలో సోమవారం ఒక స్వతంత్ర అభ్యర్థి బీఆర్ఎస్కు మద్దతుగా నిలవడంతో ఇక్కడ చైర్మన్ బీఆర్ఎస్ కైవసమైంది. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన 14మందితోపాటు ఇద్దరు ఇండిపెండెంట్ లు, ఎంఐఎం నుంచి ఒక కౌన్సిలర్ మాత్రమే హాజరయ్యారు. కాంగ్రె స్, బీజేపీ నుంచి గెలిచిన కౌన్సిలర్లు రాలేదు. దీంతో కోరం లేదని ఎన్నికను రేపటికి వాయిదా వేశారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ లో నలుగురు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు, ఇండిపెండెంట్ ఒకరు మాత్రమే రావడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ దౌర్జన్యకాండను నడపించింది. వందలాది మంది కాంగ్రెస్ నాయకులకు మున్సిపాలిటీలోకి అనుమతించిన పోలీసులు, బీఆర్ఎస్-సీపీఐ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు, నాయకులను మాత్రం క్యాతన్‌పల్లి మున్సిపాలిటీకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
క్యాతన్‌పల్లి ైప్లె ఓవర్ ఎంట్రన్స్‌లో ఓ అరగంట, ైప్లె ఓవర్ కింద దాదాపు పావుగంట కౌన్సిలర్లను అడ్డుకోగా.. ఆలోపు ఎన్నికైన కౌన్సిలర్లు ఎవ్వ రూ రాలేదని చెప్పి ఎన్నికను వాయిదా వేశారు. దీనిపై బీఆర్ఎస్, సీపీఐ నాయకులు మండిపడ్డారు. తమ కౌన్సిలర్లను అనుమతించాలంటూ బాల్క సుమన్సహా బీఆర్ఎస్, సీపీఐ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా ధరణి మధు, డిప్యూటీ మేయర్‌గా సల్ల రమ్య ఎన్నికయ్యారు.
చెన్నూర్ మున్సిపల్ చైర్మన్‌గా పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్‌గా నాయకపు వినయ్‌కుమార్.. లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్‌గా దొంత అంజలి, వైస్ చైర్మన్‌గా మోతుకరి రాజేశ్వరి ఎన్నికయ్యారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌గా దావ స్వామి, వైస్ చైర్మన్‌గా రాగంశెట్టి సతీశ్ ఎన్నికయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ చైర్మన్, వైస్ చెర్మన్లుగా గెలవడానికి బీజేపీ కౌన్సిలర్ మద్దతు ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
నిర్మల్ జిల్లాలో నిర్మల్ మున్సిపాలిటీలో అప్పాల కావ్య చైర్‌పర్సన్‌గా, ఆ మె భర్త అప్పాల గణేశ్ చక్రవర్తి వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. భైంసా మున్సిపాలిటీలో బీజేపీ, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన తుమ్మెల్ల దత్తాద్రి చైర్మన్‌గా, మరో ఇండిపెండెంట్ బీబీ కుతాజా సిద్దిఖీని వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశాలున్నాయి.
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి ఇండిపెండెంట్‌గా గెలిచిన అభ్యర్థిని వరించింది. అన్ని పార్టీల నుంచి గెలిచిన కౌన్సిలర్ల మద్దతుతో బండారి అనూష చైర్‌పర్సన్‌గా, మహమ్మద్ రోహిత్ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కైవసం చేసుకున్న ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో మెంగ్రే ఆకాశ్ చైర్మన్‌గా, ఎండీ అహ్మద్ వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కాగజ్‌నగర్‌లోనూ బీజేపీ, కాంగ్రెస్ కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పంచుకొనే దిశగా మంతనాలు సాగుతున్నట్లు తెలిసింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ రహస్య దోస్తాన్ జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
క్యాతన్‌పల్లి లో బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవ డం చర్చనీయాంశంగా మారింది. మిగిలిన మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరన్నది నేడు తేలిపోతుందా? లేకపోతే వాయి దా పడి ఎన్నికల సంఘం జోక్యం వరకు వెళ్తుందా? అన్నది ఆసక్తిగా మారింది.