ఇచ్చోడ, సెప్టెంబర్ 26 : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలిగా కుస్రం నీలాదేవి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ సెక్రటేరియట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆమె మర్యాద పూర్వకంగా కలిసి, కృతజ్ఞతలు తెలిపారు.
తనపై నమ్మకంతో రెండోసారి ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, సహకరించిన మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు ప్రజలకు మరిన్ని సేవలందించేలా తోడ్పాటునందించాలని కోరారు.