Medical Shops | 20న మెడికల్ షాపుల దేశవ్యాప్త బంద్ ను విజయవంతం చేయాలి
Medical Shops | తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా ఈ నెల 20న నిర్వహిస్తున్న మెడికల్ షాపుల బంద్ ను విజయవంతం చేయాలని తాండూర్ మండల అధ్యక్షుడు జగన్మోహన్ చారి కోరారు.
తాండూర్ : తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా ఈ నెల 20న నిర్వహిస్తున్న మెడికల్ షాపుల బంద్ ( Medical Shops Bandh ) ను విజయవంతం చేయాలని తెలంగాణ మెడికల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తాండూర్ మండల అధ్యక్షుడు జగన్మోహన్ చారి ( President Jaganmohan Chary ) కోరారు.
తాండూర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. దేశ వ్యాప్త మెడికల్ షాపుల బంద్ లో హోల్సేల్, రిటైల్ షాపుల యాజ మాన్యాలు సమ్మెలో పాల్గొంటున్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆన్లైన్ మెడిసిన్ విక్రయాల నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
2018 నుంచి ఇప్పటి వరకు అనేకసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించినా ఆన్ లైన్ మెడిసిన్ విక్రయాలు నిలిపివేయడం లేదన్నారు. వెంటనే కెమిస్ట్, డ్రగ్గిస్ట్ నిబంధనలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న విక్రయాలను నిలిపివేయాలని కోరారు. . వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయోటిక్ మందుల విక్రయాలు ప్రజలకు ప్రమాద కరమని పేర్కొన్నారు.
దేశ వాప్తంగా 40 లక్షలు, రాష్ట్రంలో 14 లక్షల హోల్సేల్, రిటైల్ షాపులున్నాయని, వీటిపై ఆధారపడి కోట్లాది యువత, ప్రజలు జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. బంద్ సందర్భంగా ప్ర జలకు ఇబ్బంది కలుగకుండా అత్యవసర వైద్య సేవల మందులు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు 93475 51355, 98660 04480 ద్వారా సంప్రదించాలని కోరారు. అనంతరం కరపత్రాలు విడుదల చేసి తహసీల్ , సర్కిల్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో తాండూర్ మండల ప్రధాన కార్యదర్శి తాటిపాముల రాంప్రసాద్, ఉపాధ్యక్షుడు భోగె శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు మామిడాల రాజేశం, బొంతల తిరుపతి, నేరెళ్ల కుమార్, గందే వెంకటరమణ, పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

